Mandapeta: మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి మృతి రాష్ట్రానికి తీర‌ని లోటు..

మండపేట (CLiC2NEWS):  పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం ఆంధ్ర రాష్ట్రానికి వైయస్సార్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. సోమవారం ఆయన మృతి పట్ల మండపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ శ్రేణులు సంతాపం ప్రకటించాయి.

స్థానిక విజయలక్ష్మి నగర్ లో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయంలో టౌన్ కన్వీనర్ ఉమ్మడి వరపు బాపిరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మున్సిపల్ చైర్మెన్ పతివాడ దుర్గారాణి, వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, ఆలమూరు తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, వైయస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, దూలం వెంకన్నబాబులు, రైతువిభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన చిత్రపటం ఏర్పాటుచేసి పూలమాలలు వేసి పుష్పాలతో శ్రద్ధాంజలి ఘటించారు. తోట త్రిమూర్తులు మాట్లాడుతూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. ఆదివారం అర్థరాత్రి ఆయన తుది శ్వాస విడిచారన్న వార్త ఎవరిని నమ్మశక్యం కలిగించ లేదన్నారు. అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో గౌతమ్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉండేదన్నారు. ఆయన నిత్యం జిమ్ యోగా వంటి వ్యాయామాలు చేస్తూ వుండే మనిషని అటువంటి సంపూర్ణ ఆరోగ్యం కలిగిన వ్యక్తి మరణించారంటే అందరిని ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.

48 సంవత్సరాల అతి చిన్న వయసులో ఆయన రాష్ట్ర ప్రజల మధ్య లేకపోవడం చాలా బాధ కలిగించే ఘటన అని అన్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. నిరంతరం ప్రజలతో సన్నిహితంగా మెలిగే మంచి నాయకుడు గౌతమ్ రెడ్డి అని కీర్తించారు. ఇటీవల రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు తీసుకురావడానికి ఆయన దుబాయ్ కూడా వెళ్లారని అన్నారు. పార్టీ పట్ల క్రమశిక్షణగా మెలుగుతూ ఎంతో నిబద్దతతో పార్టీ అభివృద్ధికి పాటు పడిన వ్యక్తి గౌతమ్ రెడ్డి అన్నారు. వైయస్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండే వారన్నారు.

తనతో కూడా సన్నిహితంగా వుండే వారని అటువంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని విచారం వ్యక్తం చేశారు. ఆయన పవిత్రమైన ఆత్మకు భగవంతుడు స్వర్గంలో మంచి స్థానం కల్పించాలని అదేవిధంగా వారి కుటుంబానికి భగవంతుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నానని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.

కార్యక్రమంలో ఏడిద సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ లు షేక్ అలీఖాన్ బాబా, మీగడ శ్రీనివాస్, కౌన్సిలర్లు పోతంశెట్టి వరప్రసాద్, మొండి భవానిమురళీ, కొవ్వాడ బేబీ అప్పన్న బాబు, నీలం దుర్గమ్మ, శెట్టి కళ్యాణి, బొక్కా సరస్వతి, అమలదాసు లక్ష్మి, మారిశెట్టి సత్యనారాయణ, పిల్లి శ్రీనివాస్, ఆంజనేయస్వామి దేవస్థానం చైర్మన్ సూరంపూడి సత్యప్రసాద్, శెట్టిబలిజ సంఘం టౌన్ అద్యక్షుడు పెంకే గంగాధర్, అబ్బిరెడ్డి వీర్రాజు, తుపాకుల ప్రసన్న కుమార్, వీరమల్లు శ్రీనివాస్, గంథం సూరిబాబు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లూరి రామక్రిష్ణ, పలివెల సుధాకర్, ఏఎంసీ వైస్ చైర్మన్ సాదే అగ్గిరాముడు, ఈలి తాతాజీ, తిరుసూల శ్రీను, యాదగిరి రామకృష్ణ, చిన్ని గంగాధరం, శెట్టి నాగేశ్వరరావు, శిరంగు శ్రీనివాస్, వాసా శ్రీనివాస్, చందన వెంకటేష్ అర్బన్ రూరల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.