బస్సును ఢీకొన్న బైక్.. బస్సుపూర్తిగా దగ్ధం
సంగారెడ్డి (CliC2NEWS): ద్విచక్రవాహనం వేగంగా ఆర్టిసి బస్సును ఢీకొన్నది. ఈ ఘటనలో బస్సు ఇంజన్ కింది భాగంలో బైక్ ఇరుక్కొని మంటలు చెలరేగి బస్సుపూర్తిగా కాలిపోయింది. బైక్పై ఉన్న వ్యక్తి ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. బస్సులో ఉన్న ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే కిందికి దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టిసి బస్సు శ్రీశైలం నుండి సంగారెడ్డికి వెళ్తున్నది. అచ్చంపేట సమీపంలో బైక్ వేగంగా బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ద్విచక్రవాహనదారుని తప్పించబోయి ఆటోను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.