జలమండలికి వాటర్ కన్జర్వేషన్ అవార్డు..

హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలికి తెలంగాణ వాటర్ కన్జర్వేషన్ అవార్డు – 2021 లభించింది. జలమండలికి ఉత్తమ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కేటగిరిలో తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ అవార్డును అందించింది.
నగరవాసులకు నీటి సంరక్షణపై అవగాహన కల్పించడానికి గానూ నీటి సంరక్షణ పద్ధతులను వివరిస్తూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కు నిర్మించడం, ఎన్జీవోల భాగస్వామ్యంతో వాక్, జలం – జీవం లాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఇంకుడు గుంతలు నిర్మించి ప్రతీయేటా పునరుద్ధరణ చేపట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు గానూ జలమండలిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
జలమండలి కార్యాలయంలో ఎండీ దానకిశోర్‌కు జలమండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు ఈ అవార్డును అందించారు. జలమండలికి అవార్డు దక్కడం పట్ల దానకిశోర్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన జలమండలి అధికారులు, సిబ్బందికి ఆయన అభినందించారు. అంతకుముందు ఖైరతాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో జరిగిన కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వి.ప్రకాశ్‌రావు చేతుల మీదుగా జలమండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు ఈ అవార్డును అందుకున్నారు.
—