పంజాబ్ తరహాలో రైతు ఉద్యమం: సిఎం కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఉద్యమం తరహాలు రైతు సమస్యలపై పోరాడాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. పంజాబ్ తరహాలో తెలంగాణ నుంచి కూడా కేంద్రం రెండు పంటలు కొనేలా ఉద్యమిద్దామని చెప్పారు. తెలంగాణ భవన్లో జరిగిన టిఆర్ ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా నేతలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. యాసంగిలో ధాన్యం కొనేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. తెలంగాణపై కేంద్రం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుందని నిప్పులు చెరిగారు. కేంద్రం ఏ వర్గాన్ని సంతృప్తి పరచడం లేదని కెసిఆర్ ధ్వజమెత్తారు. 24, 25 తేదీల్లో రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేట్టాలన్నారు.
ముఖ్యమంత్రి అధ్యక్షుతన జరుగుతున్న ఈ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ల చైర్మన్లు తదితరులు హాజరయ్యారు.