పోటి పరీక్షలకు ఉచిత శిక్షణ!

కుత్భుల్లాపూర్ (CLiC2NEWS): పోటి పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఉచిత శిక్షణా కేంద్రం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో సిఎం కెసిఆర్ అసెంబ్లీ వేదికగా 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ప్రకిటించిన విషయం తెలిసినదే. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటి, పురపాలక శాఖా మంత్రి ఆదేశాల మేరకు పోటి పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత కోసం ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన వారిచే మెరుగైన శిక్షణ ఇప్పించేందుకు ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముందుకు వచ్చారు.
కుత్భుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కెపి వివేకానంద్ తండ్రి కెఎం పాండు ఫౌండేషన్ ద్వారా చింతల్‌లోని మాణిక్యనగర్ కమిటి హాల్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.