తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖకు జాతీయ స్థాయి అవార్డు..
![](https://clic2news.com/wp-content/uploads/2021/10/vemula.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది. ఔట్ స్టాండింగ్ కాంక్రీట్ స్ట్రక్చర్-2021 విభాగంలో కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి ఈ అవార్డును సొంతం చేసుకున్నది. ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ సెంటర్ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీన ఈ అవార్డును ఆర్అండ్బి శాఖ అందుకుంది.
ఈ సందర్భంగారాష్ట్ర రోడ్లు, భావనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లడుతూ.. అవార్డు ప్రధానం చేసిన కాంక్రీట్ ఇన్స్టిట్యూట్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలయజేశారు. సిఎం కెసిఆర్ మార్గదర్శకంలో రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రతిష్టాత్యక నిర్మాణాలు శాశ్వత ప్రాతిపదికన, పూర్తి నాణ్యతతో జరుగుతున్నాయని వెల్లడించారు. ఇలాంటి అవార్డులే వాటికి నిదర్శనమని చెప్పారు. ఆర్ అండ్బి శాఖ అధ్వర్యంలో రాష్ట్రంలో నూతన సెక్రటేరియట్, అమరుల స్మమారక చిహ్నం, అంబేద్కర్ విగ్రహం, మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటి హాస్పిటల్స్, సమీకృత కలెక్టరేట్లు, కొత్త వంతెనలు లాంటి దీర్ఘకాలిక ప్రయోజనం పొందే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మించడం గర్వంగా ఉన్నదని తెలిపారు.