‘ఎర్రబెల్లి ట్రస్ట్’ ద్వారా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ..

జనగామ (CLiC2NEWS): ఆచార్య జయశంకర్ కోచింగ్ సెంటర్ ద్వారా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర పంచాయితీ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్ ఐ, కానిస్టేబుల్స్ ఉద్యాగాలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. కనీసం వెయ్యిమందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కోచింగ్ ఇప్పిస్తామని మంత్రి తెలపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో, పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, తొర్రూరు కేంద్రాల్లో ఈ శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. ఈ శిక్షణలో ఉచిత భోజన వసతితో పాటు, మెటీరియల్ను కూడా ఉచితంగా అందిస్తామని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 3వ తేదినుండి తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు. తొర్రూర్లో టెట్, పాలకుర్తిలో ఎస్ ఐ , కానిస్టేబుల్ ఉద్యోగాలకు శిక్షణ ఇస్తారన్నారు.