తైలాభ్యంగనము

తైలాన్ని ఒక క్రమ పద్ధతిలో శరీరానికి మర్దన చేయడాన్ని తైలాభ్యంగనం అని అంటారు . కింద పాదముల నుంచి తల వరకు తైలాభ్యంగనం చేయడం మన శరీరానికి మంచి పుష్టి కలుగుతుంది. పూర్వ కాలం లో ప్రతి రోజు తైల మర్దన చేసుకొని మంచి ఆరోగ్యాన్ని పొంది ఎక్కువ కాలం జీవించే వారు . ఇప్పుడున్న పరుగుల జీవితం లో ప్రతి రోజు సాధ్య పడదు కనీసం వారానికి ఒక్క సారైనా తైలాభ్యంగనం నువ్వుల నూనెతో గాని, ఆవ నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ చేసుకుంటే మంచిది . తైలాభ్యంగనం వలన మంచి నేత్ర దృష్టి పెరుగుతుంది. చర్మము కాంతి వంతంగా తయారవుతుంది. నరాలలో రక్త ప్రసరణ పెరిగి చురుకుగా పనులు చేసుకోగలుగుతారు. శరీరంలో బలం పెరగడం వలన త్వరగా అలసి పోరు. మంచి నిద్ర వలన విశ్రాంతి కలుగుతుంది.

తైలాభ్యంగనము వలన చర్మం పై నున్న స్వేద గ్రంధులు శుద్ధి చేయబడతాయి. పూర్వకాలములో అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా చెవులలో ముక్కులో నువ్వుల నూనె వేసేవారు. ఒంటికి నూనె పట్టించే వారు. అందరు ఆరోగ్యాంగా వున్నారు.uఈ రోజుల్లో నూనె వేయకూడదంటున్నారు డాక్టర్లు. తైలం చర్మం పై నున్న స్వేద గ్రంధులద్వారా శరీరం లోకి లాగబడుతుంది. ఒక గిన్నెలో తైలాన్ని తీసుకొని పాదాలనుండి తల వరకు మెల్ల మెల్లగా మర్దన చేయాలి. పొట్టపై సున్నితంగా వర్తులాకారం గడియారం ముళ్ళు తిరిగి నట్టుగారాయలి. ఆ తరువాత 20 నిముషాలు విశ్రాంతి తీసుకుని గోరు వెచ్చని నీటిలో తడిపిన తువ్వాలుతో ఒళ్ళు తుడుచుకోవాలి. ఆ తరువాత సున్నిపిండి రాచుకొని స్నానం చేయాలి. తలకు కుంకుడుకాయ లేక సీకాయ రుద్దుకోవాలి.

తైలాభ్యంగనము వల్ల  చర్మం లోని స్వేదగ్రంధులద్వారా ఎక్కవ ప్రాణవాయువు శరీరానికి అందుతుంది. మర్దనం వల్ల వాత సంబంధ నొప్పులు తగ్గిపోతాయి. కఫము బయటకు వస్తుంది. కొవ్వు కరిగిపోతుంది. శరీరంలోని కండర సముదాయము ధృడంగా తయారవుతుంది. ముఖము, చర్మము  కాంతివంతమవుతుంది ఏ పని చేయాలన్నా  ఉత్సాహం రెట్టింపు అవుతుంది. అతిగా బలహీనత ఉన్న వ్యక్తులు మరియు జ్వరం ఇతర తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారు తైలాభ్యంగనం చేసుకోకూడదు    సంపూర్ణ ఆరోగ్య వంతులు  తప్పని సరిగా  అప్పుడప్పుడు  లేదా పండుగ రోజుల్లో తైలభ్యాగనము చేసుకుంటే ఎక్కవ ప్రయోజనాన్ని పొందగలుగుతారు.

-పి.కమలాకర్ రావు

Leave A Reply

Your email address will not be published.