కాంగ్రెస్‌లో చేరిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : అందరూ ఊహించినట్లుగానే మాజీమంత్రి ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి మంగళవారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈసదర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. చెరుకు శ్రీనివాస్ రెడ్డిని మనస్ఫూర్తిగా కాంగ్రెస్‌లోకి అహ్వానిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.
(తప్పక చదవండిః టీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థిగా రామలింగారెడ్డి భార్య)
టీఆర్‌ఎస్ దుబ్బాకకు ఎం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దుబ్బాకలో టీఆరెస్ తరపున తనే అభ్యర్థిని అని హరీష్ అంటున్నారని, మరి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి పలుకుబడి ఉండదా అని ప్రశ్నించారు. దుబ్బాకలో ఎవరు పైసలు ఇచ్చిన మద్యం పంచినా ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయాలని కోరారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. చెరుకు ముత్యం రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో, సెక్రటేరియట్‌లో, తన నియోజవర్గాల్లో నిరంతరం కృషి చేశార్నారు. రేపు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాలుగు కోట్ల ప్రజల కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. ఇవ్వాళ నలుగురు మాత్రమే తెలంగాణను ఏలుతున్నారని ఎద్దేవ చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ. దుబ్బాకకు ఎనలేని సేవలు అందించిన ముత్యం రెడ్డి కుమారుడే బరిలోకి దిగుతున్నారున్నారు. పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్డినా కాంగ్రెస్ పార్టీ భయపడదని స్పష్టం చేశారు.