వేస‌వి సెల‌వులు వృథా చేసుకోవ‌ద్దు మంత్రి: స‌బిత ఇంద్రారెడ్డి

హైదరాబాద్ (CLiC2NEWS): విద్యార్థులు వేస‌వి సెల‌వుల‌ను వృథా చేసుకోకుండా న‌చ్చిన అంశాల్లో శిక్ష‌ణ పొందాల‌ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి సూచించారు. బంజారాహిల్స్ రోడ్ నెం3లోని యుబిఐ కాల‌నీ వెల్ఫేర్ అసోసియోష‌న్ ఆధ్వ‌ర్యంలో పేద విద్యార్థుల‌కు నిర్వ‌హించిన సమ్మ‌ర్ క్యాంపులో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన విద్యార్థుల‌కు మంత్రి బ‌హుమ‌తులు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వేస‌వి సెల‌వుల్లో సంగీతం, డ్యాన్స్, క్రాప్ట్‌, క్రీడ‌లు లేదా త‌మ‌కు న‌చ్చిన ఇత‌ర అంశాల్లో శిక్ష‌ణ పొందాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో యుబిఊ కాల‌నీ అధ్య‌క్షుడు, న‌రేంద్ర చోప్రా, క్యాంపు నిర్వాహ‌కులు యండ‌మూరి గీత త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.