తెలంగాణలో కొత్తగా 2,154 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంట‌ల వ‌ర‌కు 54,277 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 2,154 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,04,748 కు చేరింది. వైరస్‌ బాధితుల్లో మరో 8 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1,189 కి చేరింది.

తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 303, రంగారెడ్డి జిల్లాలో 205 కేసులు నమోదైనట్టు తెలంగాణ వైద్యారోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఇక కరోనా మరణాల రేటు దేశంలో 1.5 శాతం ఉండగా.. రాష్ట్రంలో 0.58 శాతంగా ఉందని తెలిపింది. బాధితుల రికవరీ రేటు భారత్‌లో 84.9 శాతం ఉండగా.. తెలంగాణలో 86.45 శాతంగా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు 33,46,472 నమూనాలు పరీక్షించామని పేర్కొంది.
గత 24 గంటల్లో వైరస్‌ బాధితుల్లో 2,239 మంది కోలుకోవడంతో.. రికవరీ కేసుల మొత్తం సంఖ్య 1,77,008 కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 26,551 యాక్టివ్‌ కేసులున్నాయి.

Leave A Reply

Your email address will not be published.