తెలంగాణకు 14, ఏపీకి 16 పోలీసు మెడల్స్

తెలంగాణకు 14, ఏపీకి 16 పోలీసు మెడల్స్
ఢిల్లీ: పంద్రాగస్టు సందర్భంగా ఉత్తమసేవలందించిన పోలీసులకు కేంద్రెం మంత్రిత్వ శాఖ మెడల్స్‌ను అందజేయడం స్వాతంత్రం వచ్చిన నాటి నుండి వస్తుంది. 2020 సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం నుంచి 16 మంది, తెలంగాణ రాష్ర్టం నుంచి 14 మంది మెడల్స్ అందుకోనున్నారు. తెలంగాణలో ఇద్దరు గ్యాలంట్రీ పోలీస్ మెడల్, ఇద్దరు రాష్ర్టపతి పోలీస్ మెడల్, 10 మంది విశిష్ట సేవా పోలీస్ పతకాలను అందుకోనున్నారు. అదే విధంగా ఏపీకి వచ్చిన 16 పతకాలో రెండు విశిష్ట సేవా ప్రెసిడెంట్ పోలీసు మెడల్స్, 14 ఉత్తమ సేవా పోలీసు మెడల్స్ ఉన్నాయి. అదే విధంగా
తెలంగాణ నుంచి ఎంపికైన వారు..
రాచకొండ ఏసీపీ నాయిని భుజంగరావు
మనసాని రవీందర్ రెడ్డి డీడీ ఏసీబీ హైదరాబాద్
చింతలపాటి యాదగిరి
శ్రీనివాస్ కుమార్ ఏసీపీ సైబరాబాద్
అడిషనల్ కమాండెంట్ మోతు జయరాజ్ వరంగల్
డబ్బీకార్ ఆనంద్ కుమార్ డీఎస్పీ ఇంటెలిజన్స్ హైదరాబాద్
బోయిని క్రిష్టయ్య ఏఎస్పీ, భద్రాద్రి కొత్తగూడెం
కట్టెగొమ్ముల రవీందర్రెడ్డి డీఎస్పీ, హైదరాబాద్
సీఐ ఇరుకుల నాగరాజు, హైదరాబాద్
మల్కాజ్‌గిరి ఎస్‌ఐ షేక్ సాధిక్ అలీ
ఏపీ అడిషనల్ డీజీపీ రవిశంకర్‌తో పాటు ెంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి కుమార్ విశ్వజిత్ ప్రెసిడెంట్ పోలీసు మెడల్ అందుకోనున్నారు. కాగా కేంద్ర ెంశాఖ వివిధ రాష్ష్ట్రాల నుంచి ఉత్తమ సేవలందించిన 215 మందిని గ్యాలంట్రీ పోలీస్ మెడల్‌కు, 0 మందిని ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌కు? , 631 మందిని విశిష్ట సేవ పోలీస్ పతకాలకు ఎంపిక చేసింది.
పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందన
తెలంగాణ పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగాన్ని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అభినందించారు. మహిళలు, పిల్లలు భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ‘సైబ్ హర్’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం మరో అద్భుతం సాధించిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
‘‘ఇంటర్ నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాల వినియోగం గణనీయంగా పెరగడంతో సైబర్ నేరాలు చోటు చేసుకుంటున్నాయి. సులువుగా మోసాలకు గురయ్యే అవకాశం ఉన్న పిల్లలు, మహిళలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొత్త పంథాని అవలంబిస్తున్నారు. ఈ నేరాలను అరికట్టేందుకు ‘సైబ్ హర్’ పేరుతో పోలీసులు స్పెషల్ ప్రోగ్రాం చేపట్టారు. దాదాపు 15 లక్షల మందికి సైబర్ నేరాలు జరిగే విధానం- నేరాల నుంచి బయటపడేందుకు పోలీసులు అవగాహన కల్పించారు. పోలీసులను మనసారా అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.