పొలాల చుట్టూ విద్యుత్ తీగలు అమర్చవద్దు.. సిఐ నాగ‌రాజు

వన్యప్రాణి సంరక్షణతోనే జీవసమతుల్యత సాధ్యం

రామగుండం (CLiC2NEWS): చెన్నూర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీల్వాయిలో నకిలీ పత్తి విత్తనాలు, పంట పొలాలు కాపాడడం కోసం కరెంటు తీగల ఏర్పాటు వల్ల కలిగే నష్టం మరియు, సైబర్ నేరాలపై ప్రజలకు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెన్నూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఐ నాగ‌రాజు మాట్లాడుతూ.. అటవీ జంతువుల నుండి పంట పొలాలను కాపాడడం కోసం అమర్చిన విద్యుత్తు తీగలు వన్యప్రాణులను, పశువులు అటు మనుషులను బలి తీసుకొంటున్నాయి. కొన్నిసార్లు అమర్చిన వ్యక్తులు కూడా ఉచ్చులో చిక్కుకొని ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు. విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం అనేది చట్టరీత్యా నేరమని, చట్టపరమైన కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రజలకు తెలిపారు.

నకిలీ విత్తనాల సరఫరా రవాణా నిల్వ చేసి అమ్మిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నకిలీ విత్తనాలను సరఫరా చేస్తూ అమాయకమైన రైతులను మోసం చేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచనలు మానుకోవాలని చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడినట్లయితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చట్టపరమైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రవర్తన మార్చుకోనట్లయితే పిడి యాక్టు కూడా అమలు చేయబ‌డుతుందని హెచ్చరించారు.

సైబర్ నేరాలపై తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రజలకు సూచించారు

  •  ఫోన్ లో వివిధ రూపాల్లో వచ్చే లింకులను ఓపెన్ చేయకూడదు.
  •  గుర్తుతెలియని వ్యక్తులు అదేపనిగా ఫోన్ చేస్తే ఫిర్యాదు చేయాలి
  •  ఆన్ లైన్ ద్వారా జాబ్ లు/లోన్ లు ఇస్తున్నామని వచ్చే మెసేజ్/link ల ప్రకటనలు నమ్మి డబ్బులు పంపించి మోసపోరాదు. జాబ్ లు ఇచ్చే కంపెనీ లు ఎవరిని కూడా ఆన్ లైన్ ద్వారా డబ్బులు పంపించమని అడగరు. అత్యాశకు పోయి అపరిచిత వ్యక్తులకు ఆన్ లైన్ ద్వారా డబ్బులు పంపించి మోసపోరాదు. Fake కాల్స్ కి స్పందించ రాదు.
  •  ఫోన్ పే & గూగుల్ పే లాంటి wallet/ gateway ల ద్వారా కొత్త వ్యక్తులకు డబ్బులు పంపించే ముందు వెరిఫై చేసుకున్న తర్వాతనే పంపించాలి. మొదటగా ఒక రూపాయి పంపించి వారికి ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే పెద్ద మొత్తంలో డబ్బులు పంపించాలి.
  •  సోషల్ మీడియాలో వచ్చే మోసపూరిత ప్రకటనలను నమ్మి ఎటువంటి వస్తువులను కొనుగోలు చేయరాదు, ఈ కామర్స్ & ఈ బిజినెస్ సైట్ ల ద్వారానే కొనుగోలు చేస్తే మన డబ్బుకు గ్యారంటీ ఉంటుంది.

 

మీరు సైబర్ క్రైమ్ బాధితులా? అయితే ఇలా చేయండి

  • మోసపూరిత లావాదేవీలను తక్షణమే నిలిపివేయడం కోసం, 1930 టోల్ ఫ్రీ నంబర్/ Dial 100 కు కాల్ చెయ్యండి.
  • పోయిన వెంటనే పిర్యాదు చేస్తే, సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతా లు పోలీసు అధికారులు నిలిపివేస్తారు. కొట్టేసిన నగదును బాధితుడి ఖాతా లో జమ చేసేలా చూస్తారు..
  • ఆ తరువాత NCRP portal (www.cybercrime.gov.in) లో పిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ తక్షణమే స్పందిస్తుంది.
  • ఈ కార్యక్రమంలో నీల్వాయి ఎస్ఐ జి.నరేష్, గ్రామ పెద్ద లక్ష్మీకాంత్, వేమన్‌పల్లి మండల రైతులు పాల్గొన్నారు
Leave A Reply

Your email address will not be published.