ఐదేళ్లలోపు చిన్నారులకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం..
చెన్నై(CLiC2NEWS): తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ ఐదేళ్ల లోపు చిన్నారులకు శుభవార్తనందించింది. అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో వారికి ఉచింతంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2022-23 కు సంబంధించి చేపట్టనున్న కొత్త కార్యక్రమాల గురించి ఆ రాష్ట్ర రవాణా మంత్రి ఎస్.ఎస్.శివశంర్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం తమిళనాడులో మూడు నుండి 12 ఏళ్ల వయసు కలిగిన పిల్లలకు సగం ఛార్జీలు వసూలు చేస్తుండగా.. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకొనేందుకు సుదూర ప్రాంతాలకు లగేజీ స్థలంలో కొంత భాగాన్ని పార్శిల్, కొరియర్ సర్వీసులను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు తెలిపారు.