Bellampally: పాఠశాలల విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన స‌ద‌స్సు

బెల్లంపల్లి (CLiC2NEWS): మంచిర్యాల జోన్ బెల్లంపల్లిలోని TSRWS పాఠశాల విద్యార్థులకు సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు తాళ్ళగురిజాల పోలీస్ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎస్ ఐ రాజ‌శేఖ‌ర్‌ మాట్లాడుతూ.. విద్యార్థులపై జరుగుతున్న అఘాయిత్యాలు, వేధింపులు,ఆన్లైన్ మోసాలపై అడ్డుకట్ట వేయుటకు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామ‌ని తెలిపారు. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు పెరుగుతుండటంతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని, తల్లిదండ్రుల, పరీక్షలు ముగిసిన తరువాత తమ ఇంటికి వెళ్ళాక చుట్టూ ప్రక్కల వారికి, మీ గ్రామంలలో కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు ముఖ్యంగా వారి తరగతులకు సంబంధించిన పాఠ్యాంశాలను మాత్రమే ఫోన్లు ఉపయోగించి, విద్య పై మాత్రమే శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుంచే మంచి లక్ష్యాలు అలవర్చుకొని ఆదర్శవంతమైన సమాజాన్ని రూపొందించుకోవాలని, ఆన్లైన్ మోసాలకు గురికావద్దని హితవు పలికారు.

Leave A Reply

Your email address will not be published.