బండి సంజ‌య్‌పై కెటిఆర్ ప‌రువున‌ష్టం దావా..

హైద‌రాబాద్ (CLiC2NEWS): భార‌తీయ జ‌న‌తాపార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఐటి మంత్రి కెటిఆర్ ప‌రువున‌ష్టం దావా వేశారు. ఈ మేర‌కు త‌న త‌న‌ర‌ఫు న్యాయ‌వాది ద్వారా బండి సంజ‌య్‌కి కెటిఆర్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 11వ తేదీన చేసిన ఆరోప‌ణ‌ల‌పై ట్విట్ట‌ర్‌లో స్పందించిన కెటిఆర్‌. ఆధారులు ఉంటే బ‌యట పెట్టాల‌ని.. లేదంటే బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. లేదంటే ప‌రువున‌ష్టం దావా వేస్తాన‌ని సంజ‌య్‌ని హెచ్చ‌రించారు. బండి సంజ‌య్ ఆధారాలు బ‌య‌ట‌పెట్ట‌క‌పోవ‌డంతో ఇవాళ (శుక్ర‌వారం) సంజ‌య్‌కి నోటీసులు జారే చేశారు.

మంత్రి కెటిఆర్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని… ఆయ‌న‌పై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేసి ప్ర‌చారం పొందాల‌నే దురుద్దేశంతోనే సంజ‌య్ అబ‌ద్ధాలు చెప్పార‌ని నోటీసుల్లో లాయ‌ర్ పేర్కొన్నారు. కెటిఆర్ ప‌రువుకు న‌ష్టం క‌లిగించేలా.. త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన సంజ‌య్‌.. సివిల్‌, క్రిమిన‌ల్ సెక్ష‌న్ల ప్ర‌కారం ప‌రిహారం చెల్లించ‌డంతో పాటు చ‌ట్ట‌ప్ర‌కారం త‌గిన చ‌ర్య‌ల‌కు అర్హుల‌వుతార‌ని నోటీసులో పేర్కొన్నారు. 48 గంట‌ల్లో మంత్రి కెటిఆర్‌కి భేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని లాయ‌ర్ నోలీసులో వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.