మోస్ట్ సెర్చ్ జాబితాలో తాజ్‌మహల్ మొదటి స్థానం..
ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో మోస్ట్ సెర్చ్ జాబితాలో వారసత్వ ప్రదేశాల్లో ఒకటైన ‘తాజ్‌మహల్’ నెంబర్‌వన్ స్థానంలో ఉంది. ప్రముఖ ట్రావెల్ వెబ్‌సైట్ ‘బిటాంగో’ వివరాల ప్రకారం .. మార్చి నెలలో అత్యధికంగా ఆన్‌లైన్‌లో శోధించిన వారసత్వ సంపదల జాబితాలో ఈ పాలరాతి కట్టడం తాజ్‌మహల్ మొదటి స్థానంలో నిలిచింది. ఒకే నెలలో దాదాపు 14 లక్షలకుపైగా ఈ నిర్మాణం గురించి ఆన్‌లైన్‌లో వెతికారు. ప్రపంచ ఏడు వింతలలో ఒకటైన తాజ్‌మహల్ మొఘలుల నిర్మాణ శైలికి గొప్ప నిదర్శనం. యునెస్కో ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 1,154 ప్రదేశాలను వారసత్వ సంపదగా గుర్తించింది.
పెరూ దేశంలోని మాచు పిచ్చు రెండో స్థానంలో నిలిచింది. దీనికి సుమారు 11 లక్షల సెర్చ్‌లు నమోదయ్యాయి. ఆండీస్ పర్వతాల్లో నది లోయపైన సముద్ర మట్టానికి 7900 అడుగులకు పైగా ఎత్తులో నిర్మిచంన కోట. ఇది 15వ శతాబ్ధంలో కట్టినట్లు భావిస్తారు. అడుసు ఉపయోగించకుండా రాతి గోడలను నిర్మించడం విశేషం.