శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం: ఎసిపి సారంగపాణి

పెద్దపల్లి (CLiC2NEWS): రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని మార్కండేయ కాలనీ లో రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దపల్లి ఏసిపి సారంగపాణి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించి ఇళ్లను సోదాలు చేశారు. వాహన పత్రాలు సరిగా లేని 89 వాహనాలు, 8 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ సీజ్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎసిపి సారంగపాణి  మాట్లాడుతూ.. నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి , ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా నిషేధిత గుట్కా ల మరియు గుడుంబా తయారీ, గంజాయిని విక్రహిచడం, పీడీస్ రైస్ అక్రమ రవాణా, కలప అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

మొబైల్ ఫోన్ కి బానిసలుగా మారి ఆన్లైన్లో రమ్మీ పబ్జి లాంటి గేములు ఆడుతూ చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితం నాశనం చేసుకోవద్దు అన్నారు. ఇప్పుడు పడినటువంటి ప్రభుత్వ పోలీసు ఉద్యోగాలు సాధించడానికి పట్టుదలతో కృషి చేయాలని, చట్ట వ్యతిరేకమైన పనులు చేసి కేసులు నమోదు ఐనట్లయితే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బంది పడవలసి వస్తుంది అని సూచించారు.

వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. వాహనాల సంబందించిన అని ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ కలిగి ఉండాలి అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉండి ఏదైనా ప్రమాదం జరిగిన సమయం లో ఇన్సూరెన్స్ వర్తించదు మరియు ఇన్సూరెన్స్ గడువు ముగియాక ముందే దానిని రినివల్ చేయించుకోవాలని సూచించారు.

మహిళల భద్రతే పోలీస్ లక్ష్యం అన్నారు. మహిళల, యువతులు, చిన్నపిల్లల తో మర్యాదగా ప్రవర్తించాలి. వారిని గౌరవించాలి. మహిళ పట్ల, చిన్న పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, వారిని మానసిక, శారీరకంగా హింసించిన వారిపట్ల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని తెలిపారు.

ప్రజలు, మహిళలు ఆపద సమయంలో డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం ఇచ్చే లేదా అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయ‌న్నారు. సోషల్ మీడియాలో వచ్చే పలు రకాల పుకార్లను నమ్మకూడదని, వాటిలో నిజానిజాలను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకోవాలి అని చెప్పారు.

కాలనీలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

మీ కాలనీ లో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీస్ లేదా డయల్ 100 కు ఫోన్ చేసిన వెంటనే చర్యలు చేపడతామన్నారు.

సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని మనకు తెలిసినటువంటి నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్లను లింకును ఓపెన్ చేయొద్దు అని, అత్యాశకు పోయి లాటరీ వచ్చిందని, లోన్ వచ్చిందని వచ్చిన, ఏదైనా గిఫ్ట్ లు వచ్చాయని ఫోన్ కాల్స్ వచ్చిన మెసేజ్ లు వచ్చినా వెంటనే వాటికి సమాధానమిస్తూ ఓటిపి లను పిన్ నెంబర్ లను చెప్పకూడదు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ట్లయితే వెంటనే 1930 లేదా డయాల్ 100 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో పెద్దపల్లి ఎసిపి సారంగపాణి, సిఐలు ఇంద్రసేనారెడ్డి , ప్రదీపకుమార్, సుల్తానాబాద్, పెద్దపల్లి సర్కిల్స్ ఎస్ఐలు ఉపేందర్, వినిత, వెంకటేశ్వర్లు,లక్ష్మణ్, వెంకటకృష్ణ, రాజవర్ధన్, శివాని, రవీందర్ మరియు 70 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

1 Comment
  1. cerrajeria mendoza says

    I am sure this paragraph has touched all the internet people, its really really nice piece of writing on building up
    new web site.

Leave A Reply

Your email address will not be published.