జలమండలి ఉద్యోగులకు పదోన్నతులు

హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలి పరిధిలో మొత్తం 18 మంది ఉద్యోగులకు అంతర్గత పదోన్నతి లభించింది. ఇందులో ఎనిమిది మందికి టీజీ-2 నుంచి జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా పదోన్నతి లభించింది. పది మందికి అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ నుంచి జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా పదోన్నతి లభించింది.
శనివారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో పర్సనల్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ అధ్యక్షులు రాంబాబు యాదవ్‌తో కలిసి పదోన్నతులు పొందిన వారికి ఆర్డర్ కాపీలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీజీఎం మహ్మద్ అబ్దుల్ ఖాదర్, జీఎం సరస్వతి, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ అసోసియేట్ ప్రెసిడెంట్లు రాజిరెడ్డి, జహంగీర్, ప్రధాన కార్యదర్శి జయరాజ్, నేత అక్తర్ తదితరులు పాల్గొన్నారు.