ప్రభుత్వానికంటే ప్రైవేటు ఆస్పత్రులే బలమైనవా?

ప్రభుత్వానికంటే ప్రైవేటు ఆస్పత్రులే బలమైనవా?

హైదరాబాద్: కరోనా చికిత్సల విషయంలో ప్రైవేటు ఆస్పత్రులపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ప్రైవేటు ఆస్పత్రు తీరు చూస్తుంటే ప్రభుత్వం కన్నా అవే బలమైనవిగా కనిపిస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇంత నిర్లక్ష్యంగా, లాభాపేక్షతో వ్యవహరిస్తున్న ఆస్పత్రుల లైసెన్స్‌లు ఎందుకు రద్దు చేయడంలేదని ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి రాయితీ, లీజు పద్ధతిలో భూములు పొందిన ప్క్రెవేటు ఆస్పత్రులు ఒప్పందం మేరకు పేదలకు ఉచితంగా వైద్యం చేయకపోయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది. రాయి తీగా ఇచ్చిన భూమిని, లీజుకు ఇచ్చిన భూమిని ఎందుకు తిరిగి స్వాధీనం చేసుకోవడంలేదని అడిగింది. అసలు ప్క్రెవేటు ఆస్పత్రుల్లో ఏం జరుగుతోందని ప్రభుతాన్ని ప్రశ్నించింది.

కరోనా కట్టడికి కఠిన చర్యలు చేపట్టేలా ఆదేశించాలని, ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని, కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని, కరోనా చికిత్సలు అంది స్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర శానిటరీ సిబ్బంది భద్రతకు చర్యలు తీసుకోవాలని.. ఇలా దాఖలైన 20 ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి లతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా అడొే్వకట్ జనరల్ బీఎస్ ప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్య దర్శి డాక్టర్ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధర్మా సనం ముందు హాజరయ్యారు. కరోనా కట్టడి కోసం అధికార యంత్రాంగం అెరాత్రులు శ్రమి స్తోందని, ఎందరో అధికారులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారని సోమేశ్‌కుమార్ వివరించారు. ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు, ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేసేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు.

గతంలో ఇచ్చిన ఆదేశాలను 95 శాతం వరకు అమలు చేశారని, ప్రభుత్వ పనితీరు బాగుందని, ఇంకా మిగిలిన 5 శాతం ఆదేశాలను కూడా రెండు వారాల్లో అమలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా కట్టడిలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని, దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది. తాము ప్రభుత్వాన్ని కించపర్చడం, తక్కువ చేసి మాట్లాడడం చేయడంలేదని.. అందరం కలిసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆకాం క్షతో పనిచేద్దామని సూచించింది. తదుపరి విచార ణకు సీఎస్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయిం చిన ధర్మాసనం.. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం హాజరుకావాలని పేర్కొంటూ సెప్టెంబర్ 4వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.