నగరంలో రేపు పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్ (CLiC2NEWS): మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్(కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్ – 2 రింగ్ మెయిన్ – 2కి సంబంధించి సాహేబ్‌నగర్ నుంచి మారేడ్‌పల్లి వరకు ఉన్న పైపులైన్ వాల్వుల మరమ్మత్తు పనులను జలమండలి చేపట్టనుంది.
కావున రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మొత్తం 8 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. కాబట్టి ఈ 8 గంటల వరకు కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ – 2 కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 2 – బాలాపూర్, మైసారం, బార్కాస్.
2. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 5 – మేకలమండి, భోలక్‌పూర్.
3. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 7 – తార్నాక, లాలాపేట, బౌద్ధనగర్, మారేడ్‌పల్లి, రైల్వేస్ కంట్రోల్ రూమ్, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాశ్ నగర్, పాటిగడ్డ.
4. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 9 – హస్మత్‌పేట్, ఫిరోజ్‌గూడ, గౌతమ్‌నగర్.
5. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 10 – వైశాలినగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతినగర్.
6. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 13 – మహేంద్రహిల్స్.
7. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 14 – వెలుగుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్, బీరప్పగడ్డ.
8. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 20 – మీర్‌పేట, లెనిన్‌నగర్, బడంగ్‌పేట.
కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.