సైబర్ సురక్షత-జాతీయ భద్రతపై అవగాహన సదస్సు

పెద్దపల్లి (CLiC2NEWS): రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల జేఎన్టీయూహెచ్ క‌ళాశాల‌లోని విద్యార్థులకు ఎస్ ఐ కటికే రవి ప్రసాద్ సైబర్ సురక్షత జాతీయ భద్రత అంశంపై శ‌నివారం అవగాహన సదస్సు నిర్వహించారు

ఈ అంశంపై ఆయ‌న‌ మాట్లాడుతూ.. విద్యార్థులు సైబర్ క్రైమ్స్ లో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని తగు సూచనలు తెలిపారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా కాల్ చేసి వ్యక్తిగత సమాచారం అడిగితే ఇవ్వకూడదు. గుర్తుతెలియని ఈ మెయిల్స్ కి ఎవరు కూడా రెస్పాండ్ కాకూడదు. ఎవరు కూడా ఓటిపి, కేవైసీ, సి వి వి నెంబర్లు మొదలగు వివరాలు బ్యాంకు అధికారులు అడగరు ఎవరైనా అడిగిన అపరిచిత వ్యక్తులకు ఇవ్వకూడదు. నేరుగా బ్యాంకు అధికారులను సంప్రదించవలెను. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ వాట్సాప్ లలో అపరిచిత వ్యక్తులతో చాటింగ్ గాని వీడియో కాల్స్ కానీ మాట్లాడకూడదు అని వ్యక్తిగత పాస్వర్డ్ గోప్యంగా స్ట్రాంగా క్రియేట్ చేసుకొని భద్రపరచుకోవాలి.

ఎవరైనా ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్స్ కానీ లాటరీ టికెట్స్ లో డబ్బులు గెలిచారని మభ్యపెట్టి మెసేజ్లు పంపిన వాటికి స్పందించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరు కూడా డబ్బులు కానీ జాబ్స్ కానీ ఉచితంగా ఎవరు ఇవ్వరు. ఇలా ఆశచూపి ఎరవేసి మన అకౌంట్లో ఉండే డబ్బులను కాజేసి మోసం చేసి బ్లాక్ మెయిల్ చేస్తారని తెలిపారు. ఎవరైనా సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేసిన, బ్లాక్ మెయిల్ చేసిన వెంటనే సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు ఫిర్యాదు చేయగలరు అని విద్యార్థులను చైతన్య పరిచారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ లెక్చరర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.