Basara IIIT: కిలిక్కి రాని చర్చలు!
![](https://clic2news.com/wp-content/uploads/2022/06/bssara-IIIT.jpg)
బాసర (CLiC2NEWS): బాసర ఐఐఐటి విద్యార్థులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు చర్చలు జిరిపారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోని స్టూడెంట్ అక్టివిటి సెంటర్లో దాదాపు వెయ్యి మంది విద్యార్థులతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల డిమాండ్లపై చర్చలు జరిపారు.
విద్యార్థుల 12 డిమాండ్లలో 60 శాతం నెరవేరుస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడటం తమ బాధ్యతని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు రెగ్యూలర్ అధ్యాపకులు, విసీని నియమించాలని డిమాండ్ చేశారు. విసి నియామకం మాత్రం ఇప్పట్లో కుదరదని అధికారులు చెప్పారు. దీంతో మంత్రి, అధికారుల హామీపై స్పష్టత లేదని విధ్యార్థులు చెబుతున్నారు. కాగా 12 డిమాండ్ల పరిష్కారం కోసం ఐఐటి విద్యార్థులు గత 5 రోజుల నుంచి నిరసన ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌తో పాటు కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ ఐఐఐటి డెరక్టర్ సతీష్ కుమార్, ఉన్నత విద్యామండలి చైర్మన్ వెంకటరమణ పాల్గొన్నారు.