నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.63% పోలింగ్

నిజామాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 99.63 శాతం పోలింగ్ నమోదు అయింది. మొత్తం 824 ఓట్లకుగాను 821 ఓట్లు పోలయ్యాయి. కోవిడ్ పాజిటివ్‌గా తేలిన 24 మందిలో 21 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో 19 మంది పీపీఈ కిట్లు ధరించి ఓటేయగా మిగతా ఇద్దరు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. ఉపఎన్నిక బరిలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ పార్టీ నుంచి సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ ఎన్నికల బరిలో ఉన్నారు. బ్యాలెట్ పద్దతిలో ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ నిర్వహణను చేపట్టారు. ఎక్స్‌అఫీషియో సభ్యులు, ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ నెల 12న ఓట్ల లెక్కించి ఆరోజే ఫలితాలను ప్రకటించనున్నారు.