రూ.కోటి 65 లక్షల నోట్లతో వినాయకుడి మండపం

గుంటూరు (CLiC2NEWS): వినాయక చవితి సందర్భంగా వాడ వాడలా భక్తులు విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్లైతే ఏకంగా రూ.కోటి 65 లక్షల కరెన్సీ నోట్లతో గణేశుడికి పూజలు నిర్వహించారు. గణనాథుడికి కరెన్సీ నోట్లతో మండపం, అలంకరణ, అభిషేకాలు నిర్వహించారు భక్తులు. గుంటూరులోని ఆర్. అగ్రహారం శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో కరెన్సీ నోట్లతో గణనాథుడికి మండపం ఏర్పాటు చేశారు. వరంగల్‌లోని శివనగర్ కాలనీ వాసులు కరెన్సీ నోట్లను దండలుగా చేసి వినాయకుడికి అలంకరించారు. భక్తులు గణేషుడికి నోట్ల కట్టలతో అభిషేకాలు నిర్వహించి లక్ష్మీ పూజలు చేశారు.