రామన్ మెగసెసే అవార్డును తిరస్కరించిన కేరళ మాజీ మంత్రి

ఢిల్లీ (CLiC2NEWS): కేరళ మాజీ మంత్రి, సిపిఎం సీనియర్ నేత ప్రతిష్ఠాత్మకమైన రామన్ మెగసెసే అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. వైద్య రంగంలో అందించిన సేవలకు గాను ఆసియా నోబెల్‌గా భావించే రామన్ మెగసెసే అవార్డుకు కేరళ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ.. ఆరోగ్యశాఖ సమిష్టి కృషి ఫలితంగా వచ్చిన ఈ అవార్డును వ్యక్తిగత హోదాలో స్వీకరించలేనని పేర్కొన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఉన్న శైలజ.. పార్టీతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫిలిఫ్పీన్స్‌లో కమ్యూనిస్టులపై క్రూరత్వానికి పాల్పడిన రామన్ మెగసెసే పేరుతో ఇస్తున్న ఈ పురస్కారాన్ని ఆమె తిరస్కరించారన్నారు. ఈ అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
1957వ సంవత్సరంలో అమెరికాకు చెందిన రాక్ ఫశ్రీల్లర్ బ్రదర్స్, ఫిలిఫ్పీన్స్ ప్రభుత్వం సంయుక్తంగా ఫిలిఫ్పీన్స్ మాజీ అధ్యక్షడు రామన్ మెగసెసే పేరిట పురస్కారాన్ని అందిస్తున్నారు. ఈ అవార్డును ప్రభుత్వ సర్వీసులు, ప్రజా సేవలు, అంతర్జాతీయ అవగాహన, జర్నలిజం, సాహిత్యం, కమ్యూనిటి లీడర్‌షిప్ వంటి విభాగాల్లో విశేష సేవలందించిన ఆసియా దేశాల వారికి ప్రానం చేస్తారు. ఈ పురస్కారాన్ని ఆసియా నోబెల్‌గా కూడా పిలుస్తారు.