రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్వే వంతెన వారంపాటు మూసివేత

రాజమహేంద్రవరం (CLiC2NEWS): నేటి నుండి వారం రోజుల పాటు రాజమహేంద్రవరంలోని రోడ్ కమ్ రైలు వంతెనపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మరమ్మతుల నిమిత్తం వంతెన మూసివేస్తున్నట్లు తెలిపారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా ధవళేశ్వరం కాటన్ బ్యారేజి, గామన్ వంతెన మీదుగా వాహనాలను మళ్లిస్తున్నట్లు అధికారులు వివరించారు. అయితే ఈ నెల 17వ తేదీన రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్వే వంతెన మీదుగా అమరావతి రైతుల పాదయాత్ర వెళ్లనుంది. ఈ సమయంలో వంతెన మరమ్మత్తుల నిమిత్తం మూసివేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. విపక్షాలు మాత్రం పాదయాత్రను అడ్డుకోవాలనే కుట్ర పూరితంగా వంతెనను మూసివేస్తున్నారని ఆరోపిస్తున్నారు.