కొత్త కేసులు 55 వేలు.. కోలుకున్న వారు 77 వేలు

న్యూఢిల్లీ ‌: దేశంలో క్రియాశీల క‌రోనా కేసులుక్ర‌మంగా త‌గ్గుతుండ‌టం ఊర‌ట‌నిస్తోంది. గ‌త కొన్ని రోజులుగా తగ్గుతూ వ‌స్తున్న యాక్టివ్ కేసులు మంగ‌ళ‌వారం నాటికి 8,38,729 కి ప‌డిపోయాయి. దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 71.75 ల‌క్ష‌ల‌కు చేరుకున్న‌ది. కేంద్ర ఆరోగ్య శాఖ వివ‌రాల ప్ర‌కారం..ఇక గ‌డ‌చిన 24 గంట‌ల్లో 55,342 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన రెండు నెల‌ల్లో వైర‌స్ కేసుల సంఖ్య త‌గ్గ‌డం ఇదే మొద‌టిసారి. సెప్టెంబ‌ర్‌లో వైర‌స్ కేసులు పెరిగిన త‌ర్వాత‌.. 70 వేల క‌న్నా త‌క్కువ కేసులు వ‌రుస‌గా న‌మోదు కావ‌డం ఇదే ప్ర‌థ‌మం. గ‌త 24 గంట‌ల్లో వైర‌స్ వ‌ల్ల 706 మంది చ‌నిపోయారు. 71,75,881 పాజిటివ్ కేసుల్లో.. ప్ర‌స్తుతం 8,38,729 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 62,27,296 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య 1,09,856కి చేరిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది. క‌రోనా మ‌ర‌ణాల రేటు 1.53శాతంగా ఉంది.

Leave A Reply

Your email address will not be published.