మంచిర్యాలలో మహాత్మ జ్యోతిరావు పూలే కు ఘనంగా నివాళులు 

మంచిర్యాల (CLiC2NEWS):  మంచిర్యాలలో స్థానిక పూలే చౌరస్తా (బెల్లంపల్లి) చౌరస్తా వద్ద తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య .. జ్యోతిరావు పూలేకు ఘనంగా నివాళులర్పించరు.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బీసీ జాగృతి పూలే చౌరస్తాలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని స్థాపించుటకై తెలంగాణ బీసీ జాగృతి చేస్తున్న డిమాండ్ ను మా మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో చర్చించి పర్మిషన్ ఇచ్చే విధంగా తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు. పూలే ఆశయాలను స్ఫూర్తి గా తీసుకొని మనందరం ముందుకు వెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్ ,మాజీ వైస్ చైర్మన్ నల్ల శంకర్, సీనియర్ నాయకులు బిసి తుల మధుసూదన్, బేర ప్రభాకర్ బొలిశెట్టి రాజలింగు, గడ్డం సుధాకర్ కల్వల సుధాకర్, నులిగొండ ప్రకాష్, కోసరి రవీందర్నాథ్, రాజేశం గౌడ్, తెలంగాణ బీసీ జాగృతి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నరేంద్ర శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు మడుపు రామ్ ప్రకాష్ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్ ఉపాధ్యక్షులు బిట్రగుంట రాంబాబు బోయిన హరికృష్ణ, మెంతియాల సంతోష్, కోశాధికారి సల్ల విజయ్ కుమార్ యువ జాగృతి అధ్యక్షుడు మంచర్ల సదానందం బద్ది శ్రీనివాస్ వెన్నపల్లి రవీందర్, గుమ్మల శ్రీనివాస్ , జక్కం రవీందర్ గంద శ్రీ తిరుపతి, చంద్రగిరి శంకర్, ముచ్చగుర్తి భూమేష్, భూపతి రమేష్ మొగిలి తిరుపతి ఎడ్ల కిషన్, మల్లపు రాజు ప్రకాష్ పటేల్, డేగ లక్ష్మణ్ దూలం రాజేందర్ కీర్తి రవి, ప్రదీప్ చంద్ర కర్ణ కంటి రవీందర్ తదితరులు పాల్గొన్నారు
Leave A Reply

Your email address will not be published.