కారు లిప్ట్ అడిగి.. ఏకంగా కారునే కొట్టేశారు!

ఢిల్లీ (CLiC2NEWS): నలుగురు వ్యక్తులు లిప్ట్ అడిగి .. కారు యజమాని కళ్లల్లో కారం కొట్టి కారుతోసహా పరారయ్యారు. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడాలోని సెక్టార్-93లో ఉండే ఓ వ్యక్తి ఢిల్లీ పనిచేస్తున్నాడు. అతను కారులో వెళ్తుండగా.. నలుగురు వ్యక్తులు ఆపి లిఫ్ట్ కావాలని అడిగారు. తాము ఢిల్లీకి వెళ్లాలని, ఛార్జీలు ఇస్తామని చెప్పి కారు ఎక్కారు. కొంత దూరం వెళ్లిన తర్వాత కారు గల వ్యక్తి కళ్లలో కారం కొట్టి.. కారును గురుగ్రామ్, హరియాణా వైపు మళ్లించారు. కారుగల వ్యక్తిని కిందకు తోసేసి పరారాయ్యారు. పోలీసులు ఇద్దరు నిందుతులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం.