మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం: ఒకే ఇంట్లో అరుగురు సజీవదహనం
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/fire-accident-near-mandamarri-mandal.jpg)
మంచిర్యాల (CLiC2NEWS): జిల్లాలోని మందమర్రి మండలం, వుడిపెల్లిలో ఒకే ఇంట్లో ఆరుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులుతో పాటు సింగరేణి ఉద్యోగి శాంతయ్య, మాసు శివయ్యా, ఆయన భార్య మాసు పద్మ, మౌనికగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి నిప్పు పెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. డిసిపి అఖిల్ మహాజన్, సిఐ ప్రమోదరావు ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.