వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి రూ. 500లకే గ్యాస్ సిలిండర్.. రాజస్థాన్ సిఎం
![](https://clic2news.com/wp-content/uploads/2021/02/gas-750x313.jpg)
జైపూర్ (CLiC2NEWS): రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గహ్లోత్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ఉజ్వల్ పథకం లబ్ఢిదారులకు రూ. 500లకే గ్యాస్ సిలెండర్ పంపిణీ చేస్తామన్నారు. ఉజ్వల్ పథకం కింద నమోదు చేసుకున్న దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుండి ప్రతి కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్లను సగం ధరకే అందిస్తామన్నారు. ఉజ్వల పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోని పేదలకు వంటగ్యాస్ కనెక్షన్లు అందించిన విషయం తెలిసిందే.