రాష్ట్రంలో రేపటి నుండి గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ..
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/kcr-nutritional-kits.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో రేపటి నుండి గర్భిణులకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లను అందించనున్నారు. గర్భిణులలో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారంచడంతో పాటు శిశు మరణాల నివారణ కోసం ప్రభుత్వం ఈ కిట్లను అందజేయనుంది. రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు కామారెడ్డి నుండి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. గర్భిణులకు పోషకాహార కిట్ల కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నది. వీటిని ప్రాథమికంగా తొమ్మిది జిల్లాల్లో పంపణీ చేయనున్నారు.