బిఆర్ఎస్కు ఆదివాసీ సర్పంచ్ల రాజీనామా..!

వాంకిడి (CLiC2NEWS): బిఆర్ఎస్కు భారీ షాక్ ఇచ్చిన 18 ఆదివాసీ సర్పంచ్‌లు. కుమురం భీం జిల్లా వాంకిడి మండలానికి చెందిన ఆదివాసీ సర్పంచ్‌లు భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీకీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వాంకిడిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఈ విషయాన్ని తెలిపారు. వీరంతా.. 2019 సంవత్సరంలో అధికార పార్టీలో చేరామని.. తమ గ్రామాల్లో అభివృద్ది జరుగుతుందని ఎదురుచూసినా ఎలాంటి ఫలితం జరగలేదన్నారు. వారి పదవీకాలం తొలినాళ్లలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు సైతం రాకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. 18 మంది సర్పంచ్ల రాజీనామా పత్రాన్ని బిఆర్ఎస్ మండల అధ్యక్షడు అజయ్‌కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పకు అందజేయనున్నట్లు సమాచారం.