అర్ధ మత్స్యేంద్రాసనం
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/Screenshot_20230107-170233_WhatsApp-750x430.jpg)
అర్ధ మత్స్యేంద్రాసనం … మత్స్యంద్రనాధ యోగి, ఈ ఆసనంలో కూర్చోని తపస్సు చేసుకునేవారు గనుక దీనికి ఆ పేరు వచ్చింది. వెన్నుముక తన ఆసనం పైన గుండ్రని దశలో ఉంటుంది. ఈ ఆసనంలో అది వృత్తకారంలో తిరుగుతుంది. మిగిలిన ఆసనాలలో అయిన వెన్ను ముందు, వెనుకలకు, కుడి, ఎడమల మాత్రమే తిరుగుతుంది.
వెన్నులో సర్వీకల్ భాగంలో వచ్చే నొప్పులు, తలలో వచ్చే మైగ్రేన్ నొప్పులతో బాటు వెన్నులో తల ఎత్తే దోషాలన్ని తగ్గుతాయి. ఈ ఆసనంలో వెన్నుముక కింద భాగం తక్కువగాను, పైభాగం ఎక్కువగాను, తిరుగుతాయి. ఎంతో కాలంగా బాధపడుతున్న జిగట విరోచనాల వలన కలిగే కడుపు నొప్పి, కడుపులోని నులిపురుగులు, నరాల బలహీనత, వంటి బాధలు ఈ ఆసనాన్ని నిరంతరం అభ్యశించటం వలన తగ్గుతాయి. మహిళలలో రుతుదర్మం సక్రమంగా వస్తుంది.
గుండె, స్ప్లీన్, జీర్ణశయాలా, మీద బలం పడటం వలన అవి చురుకుగా పనిచేస్తాయి. పాంక్రియాజ్ శ్రావం అదుపులో ఉంటుంది. దీని వలన మధుమేహం జబ్బులు నయం అవుతాయి.
పొత్తి కడుపులోని అంగాలు ఒకదానితో ఒకటి సహకరిస్తూ పనిచేస్తాయి.
శరీరం కాంతివంతగా ఉంటుంది. జీర్ణశక్తి బాగుంటుంది. ఊపిరితిత్తులకు, హృదయానికి బలం వస్తుంది.
చేసే విధానం.. ఆసనం పై కూర్చోవాలి. కుడికాలు మడమ, ఎడమ తోడ దగ్గరకు వచ్చేటట్లు కాలుని మడవాలి.ఎడమ కాలును కుడిముడుకు బయట నిలబెట్టాలి. ముడుకు ఛాతి దగ్గరగా ఉండాలి. శ్వాసను వదులుతూ భుజం పై భాగంలో ముడుకును నొక్కుతూ ఎడమ అరికాలుని పట్టుకోవాలి. ఎడమ చేతిని నడుము వెనుకకు పెట్టాలి. మెడను సాధ్యమైనంత వరకు ఎక్కువసేపు ఈ స్థితిలో ఉండాలి. శ్వాసను సామాన్యంగా ఉంచాలి. ఇదే క్రియను రెండో వైపు ఆచరించాలి.
నిలబెట్టిన కాలివేళ్ళు నెలకు అనిన రెండో కాళీ ముడుకు కన్న ముందుకు పోకూడదు. ఇదే ఆచరణలోకి వచ్చేవరకు నడుము, మెడ తిన్నగా ఉండాలి.
ఈ ఆసనాన్ని వేస్తున్నంత సేపు నడుము, మెడ, తిన్నగా ఉండాలి. గడ్డం భుజానికి సమానంతరంగా ఉండాలి. రెండు భుజాలు ఒకే సరళరేఖలో ఉండాలి. శరీరం కుడి ఎడమలకు ఏ మాత్రం వంగకూడదు.
–షేక్. బహార్ అలీ
యోగాచార్యుడు
ONLINE YOGA CLASSES కొరకు సెల్: 7396126557 సంప్రదింగలరు.