కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా ప్రారంభమైన క్రీడాపోటీలు
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/ASIFABAD.jpg)
ఆసిఫాబాద్ (CLiC2NEWS): జిల్లా కేంద్రంలోని హెడ్ క్వార్టర్‌లో పోలీసుల క్రీడాపోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎస్‌పి సురేశ్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలలో వాలీబాల్, అథ్లెటిక్స్, చెస్, క్యారమ్స్ తదితర పోటీలు నిర్వహించారు. మూడు రోజుల పాటు ఈ పోటీలు కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్‌పి అచ్చేశ్వరరావు, జిల్లాలోని పోలీసు అధికారులు పాల్గొన్నారు.