జగనన్నతోడు పథకం.. చిరు వ్యాపారులకు రూ.16.80 కోట్లు
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/ap-news-anantapuram.jpg)
అనంతపురం (CLiC2NEWS): ‘జగనన్న తోడు పథకం’ కింద చిరు వ్యాపారులకు ప్రతి ఏటా వడ్డీలేని రుణంగా రూ. 10వేలు అందిస్తున్నామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టరేట్లో జగనన్న తోడు పథకం ద్వారా నిర్దేశిత లబ్ధిదారులకు రూ. 16.80 కోట్ల నమూనా చెక్కును అందజేశారు. జిల్లాలో ఉన్న 16,169 మంది చిరు వ్యాపారులకు రూ. 10 వేలు చొప్పున రూ. 16.16 కోట్లు.. అంతే కాకుండా 25,366 మందికి రుణమాఫీ కింద రూ. 66.13 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఎవరికైనా రుణం అందకపోతే వారికి జూన్లో అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పి ఛైర్ పర్సన్, అసిస్టెంట్ కలెక్టర్, నగర మేయర్ తదితరులు పాల్గొన్నారు.