Warngal: ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. రూ. కోటి మేర ఆస్తినష్టం

శివనగర్ (CLiC2NEWS): వరంగల్‌లోని ఓ ఫర్నిచర్ గోదాంలో మంటలు వ్యాపించి సుమారు రూ. కోటి ఆస్తినష్టం జరిగినట్లు భావిస్తున్నారు. 12 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తేవడానికి సిబ్బంది ప్రయత్నించారు. పాత దర్వాజాలు, కిటికీలు విక్రయించే దుకాణాలకు చెందిన గోదాంలో మంటలు చెలరేగి.. అందులో ఉన్న మొత్తం ఫర్నిచర్ దగ్ధమైపోయింది. మంటలు పక్కనే ఉన్న షాపులకు కూడా వ్యాపించాయి. చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు పొగ అలుముకుని స్థానికులు ఉక్కిరిబిక్కరి అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.