శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

శ్రీకాకుళం (CLiC2NEWS): వారంతా రెక్కాడితేగాని డొక్కాడని కూలీలు. పగలంతా కూలి పని చేసుకుని జీవనం గడపేవారు. రోడ్డు ప్రక్కన నడుచకుంటూ వెళ్తున్న కూలీలపైకి ఓ లారి దూసుకొని రావడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలోని మందాడ గ్రామం వద్ద ఓ లారీ అదుపుతప్పి ఉపాధి హామీ కూలీలను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ముగ్గురు కూలీలు మరణించగా.. పలువురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరణించిన వారు పాపమ్మ, అంబటి సత్తెమ్మ, లక్ష్మి, మందాడ గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.