ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నం నాకొద్దంటూ.. రాజాసింగ్ ఆగ్ర‌హం

హైద‌రాబాద్ (CLiC2NEWS): త‌న‌కు ఇచ్చిన బుల్ల‌ట్ ప్రూఫ్ వాహ‌నం వ‌ద్దంటూ.. గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సిఎం, హోంమంత్రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గురువారం ఆయ‌న అసెంబ్లీ నుండి వెళ్తున్న స‌మ‌యంలో వాహ‌నం ముందు చ‌క్రం ఊడిపోయింద‌ని తెలిపారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం పాడైపోంతుంద‌ని ఎన్నిసార్లు చెప్పినా ప‌ట్టించుకోకుండా త‌న‌కు అదే వాహనం కేటాయించ‌డంపై ఆయ‌న మండిప‌డ్డారు. వాహ‌నం వేగంగా వెళ్తున్న స‌మ‌యంలో ఇలా జ‌రిగితే ఎంత ప్ర‌మాదం జ‌రిగేద‌ని ప్ర‌శ్నించారు. ఈ వాహ‌నాన్ని వాహ‌నం మార్చ‌మ‌ని చెప్పినా ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని.. వాహ‌నం మార్చండి లేదా మీ వాహ‌నం మీరు తీసుకోండి అని రాజాసింగ్‌ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

Leave A Reply

Your email address will not be published.