కొండగట్టులో పర్యటిస్తున్న సిఎం కెసిఆర్
జగిత్యాల (CLiC2NEWS): ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం కొండగట్టులో పర్యటిస్తున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి సిఎం కెసిఆర్ రూ. 100 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసినదే. ఈ మేరకు గతవారం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక కొండగట్టు పుణ్యక్షేత్రం అభివృద్ది పనులు షురూ అయ్యాయి. దీనిలో భాగంగా ప్రముఖ ఆర్కిటెక్చర్ ఆనందసాయి కొండగట్టుకు వచ్చి పరశీలించినట్లు సమాచారం. ఈనేపథ్యంలో అధికారులతో సమావేశమై కార్యాచరణ రూపకల్పన నిమిత్తం బుధవారం ముఖ్యమంత్రి కెసిఆర్ కొండగట్టులో పర్యటిస్తున్నారు.
కొండగట్టులో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సిఎం కెసిఆర్ కు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయానికి చేరుకున్న సిఎం కెసిఆర్ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదాశీర్వచనం అందించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించారు.
[…] […]