యువత చెడు వ్యసనాలకు లోనుకావద్దు: డిసిపి కేకన్ సుదీర్

మంచిర్యాల (CLiC2NEWS): తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టంపేట గ్రామంలో పోలీస్ సిబ్బంది ‘కమ్యూనిటీ కాంటాక్ట్’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్ర‌జ‌ల‌తో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల డిసిపి కేకన్ సుదీర్ రాంనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

యువత చెడు వ్యసనాలకు లోనుకావద్ద‌ని..సంఘ విద్రోహ శక్తులకు సహకరించి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని యువత కు, ప్రజలకు సూచించారు. కమ్యూనిటీ కాంట్రాక్టు కార్యక్రమంలో భాగంగా యువత మరియు ప్రజలతో మాట్లాడినప్పుడు వారి గ్రామంలోని యువత ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయ్యే పుస్తకాలు తో కూడిన లైబ్రరీ ఏర్పాటు చేయాలని..స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు గ్రామ ప్ర‌జ‌లు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత ప్రభుత్వ శాఖ వారితో మాట్లాడి పరిష్కారం చేయడం జరుగుతుందని డిసిపి తెలిపారు.

పోలీసులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడమే పోలీసులు ధ్యేయమన్నారు. ఎలాంటి సమస్య ఉన్న చట్టపరిధిలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండా లని, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం, ఓటీపీ వివరా లను చెప్పవద్దన్నారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వారు వస్తే ఆశ్రయం ఇవ్వద్దన్నారు. అనంతరం, యువతకు క్రికెట్ బ్యాట్స్ కిట్స్ ని డిసిపి అందజేశారు. ఈ
కార్యక్రమంలో బెల్లంపల్లి ఎసిపి సదయ్య, తాండూరు సిఐ జగదీష్, తాండూర్, బెల్లంపల్లి కాజిపేట్ , ఎస్ఐలు , తాండూర్ పోలీస్ సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు,

 

Leave A Reply

Your email address will not be published.