ధాన్యం కొనుగోలు కేంద్రాలను సజావుగా నిర్వహించాలి

ఎల్లారెడ్డిః ధాన్యం కొనుగోలు కేంద్రాలు సజావుగా నిర్వహించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి లోని ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని సూచించారు. కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడారు. ధాన్యం కోసిన రైతుల వివరాలు వరుసక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు నమోదు చేసుకోవాలని సూచించారు. తాగునీరు, నీడ వసతి కల్పించాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా వ్యవసాయ అధికారి సునీత ,ఆర్ డి ఓ శీను , రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.