పర్యాటకులను ఆకర్షించటానికి తైవాన్ ప్రభుత్వ తాయిలాలు
![](https://clic2news.com/wp-content/uploads/2023/02/Taiwan-tourism.jpg)
తమ దేశంలోకి పర్యాటకులను ఆకర్షించడానికి తైవాన్ ప్రత్యేక దృష్టి సారించింది. సందర్శకులను ఆహ్వానించడానికి 530 కోట్ల తైవాన్ డాలర్ల (సుమారు రూ.14.186 కోట్ల) ప్యాకేజిని ప్రకటించింది. దీని ప్రకారం తమ దేశానికి వచ్చే ఒక్కో విదేశీయుడికి 5000 తైవాన్ డాలర్లు (రూ. 13,500) ప్రోత్సాహకాలను ప్రకటించింది.
కొవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన అనంతరం తమ దేశ ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి తైవాన్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పర్యాటకులను తమ దేశంలోకి ఆహ్వానించడానికి కొన్ని చర్యలు చేపట్టింది. ఈ సంవత్సరం కనీసం 60 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించాలని తైవాన్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం సందర్శకులకు ప్రోత్సాహకాల ప్రకటన చేసింది. ఈ ప్రోత్సాహాకాలను లక్కీ డ్రా లేదా విమానయాన సంస్థల ద్వారా పంపిణీ చేయనున్నట్లు సమాచారం. వీటిని నగదు లేదా ఎలక్ట్రానిక్ రూపంలోగాని లేదా.. వసతి, రవాణా కొనుగోళ్లపై డిస్కౌంట్ రూపంలో అందించ నున్నారు. ట్రావెల్ ఏజెన్సీలకు కూడా 10,000 నుండి 20,000 వరుకు తైవాన్ డాలర్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది.