మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు..
మూగ చెవిటి దివ్యాంగ మైనర్ బాలికను తల్లిని చేశాడు..

రాజవొమ్మంగి (తూర్పుగోదావరి)ః అభం శుభం తెలియని మూగ చెవిటి వికలాంగులైన ఓ మైనర్ బాలికను ఓ ప్రబుద్ధుడు మాయమాటలు చెప్పి లోబర్చుకుని ఓ బిడ్డకు తల్లిని చేశాడు. ఏజెన్సీలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలను డీఎస్పీ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. ఏజెన్సీలోని రాజవొమ్మంగి మండలం మారేడుబాక గ్రామపంచాయతీ శివారు ఊర్లకులపాడులో కోసూరివారి వీధికి చెందిన మూగ, చెవిటి గల మానసిక మైనర్ వికలాంగ బాలిక అక్టోబర్ నెల 4వ తారీఖున ఓ ఆడపిల్లకు జన్మనివ్వడం రాజవొమ్మంగి మండలంలోని అత్యంత సంచలనం రేకెత్తిచింది . వివరాలలోకి వెళితే మైనర్ బాలిక తల్లి విశాఖపట్నం జిల్లాలోని అలిమియపురం గ్రామానికి చెందిన దల్లి సింహాచలం అనే ఓ వ్యక్తితో సన్నిహితంగా మెలగడంతో ఆమె కోసం అక్కడ నుంచి తరచు సింహాచలం వస్తూ ఉండేవాడు. అయితే అదే అదునుగా చూసుకున్న నేరస్థుడు దల్లి సింహాచలం ఆ మహిళా ఇంట్లో ఉన్న అమాయక మైనర్ బాలికపై కన్నేసి ఇంట్లో ఎవరులేని సమయంలో బాలిక కు యెంతో నమ్మకస్థుడుగా నటించి అభంశుభం తెలియని ఆ మానసిక మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. ఆ పాపం పని ఫలితంగా బాలిక గర్భం ధరించింది. ఎట్టకేలకు బాలికతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నా తీరును గమనించిన తండ్రి, నేరస్థుడైన దల్లి సింహాచలంను పలుమార్లు మందలించాడు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని జరిగిన విషయం ఎవరికి చెప్పుకోలేకపోయాడు. బాధితురాలు 4వ తారీఖున విశాఖలోని వారు ఉంటున్న నివాసంలోని ఆడపిల్లలను ప్రసవించింది. అనంతరం బాలికను మదురవాడలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక మానసిక వికలాంగ మైనర్ గా గుర్తించి, పూర్తి సమాచారం తెలుసుకున్న అక్కడ వైద్య సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు పిర్యాదు చేయడంతో అక్కడ పోలీసులు జీరో కేసును నమోదు చేసి, బాధితురాలు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారు కావడంతో రాజవొమ్మంగి సర్కిల్ లోని జడ్డంగి పోలీసు స్టేషన్ కి కేసును బదిలీ చేశారు. వెంటనే రాజవొమ్మంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ యమ్ నాగ దుర్గరావు, జడ్డంగి సబ్ ఇన్స్పెక్టర్ ముడిలీ మోహన్ కుమార్ ల సంయుక్త ఆధ్వర్యంలో కేసుపై విచారణ చేసి 15వ తారీఖున నిందితుడు దల్లి సింహాచలంను రాజవొమ్మంగి మండలం లబ్బార్తి గ్రామ జంక్షన్ వద్ద పోలీసులు అదుపులో తీసుకున్నారు. పెద్దాపురం డీఎస్పి ఏ శ్రీనివాస్ వివరాలను మీడియాకు వెల్లడించారు. నిందితుడిపై పొక్స్ యాక్టు కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీఎస్పి తెలిపారు.