మార్చి 8 నుండి తెలంగాణలో ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం..
హైదారాబాద్ (CLiC2NEW): మార్చి 8వ తేదీ ‘ప్రపంచ మహిళా దినోత్సవం’ సందర్భంగా రాష్ట్ర మహిళలకు బహుమతిగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. మహిళల ఆరోగ్య రక్షణకు ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సూచనల మేరకు మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రణాళిక రూపొందించిందన్నారు. ప్రతి మహిళా ఆరోగ్యం ఉండాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర మహిళలకు బహుమతిగా అందిస్తున్నట్లు మహిళలు ఎదుర్కునే 8 రకాల ఆరోగ్య సమస్కలకి వైద్యం అందిస్తుందన్నారు. మహిళలకు ప్రత్యేక వైద్యసేవలు ప్రతి మంగళవారం ప్రారంభిస్తామని.. తొలుత 100 ఆరోగ్య కేంద్రల్లో, మొత్తం 1200 సెంటర్లకు విస్తరించాలనే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి హరీశ్‌రావు వివరించారు.