TSPSC Paper leak: అక్టోబర్ నుండే స్కెచ్.. సిట్ నివేదికలో సంచలన విషయాలు
హైదరాబాద్ (CLiC2NEWS): టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నపత్రాల లీకేజికి సంబంధించిన సిట్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టిఎస్‌పిఎస్‌సిలో సిస్టమ్ ఎనలిస్ట్ , కార్యదర్శి పిఎ ప్రవీణ్‌ల ద్వయం అక్టోబర్ నుండి దందా మెదలుపెట్టినట్లు వెల్లడైంది. ఆరు నెలలుగా వ్యవహారం న దీని కోసం మొత్తం కంప్యూటర్ వ్వవస్థను తమ అధీనంలోకి తెచ్చుకొని అప్పటినుండే కాన్ఫిడెన్షియల్ సిస్టమ్‌లో యాక్సెస్ అయినట్లు సమాచారం. ఎప్పడనుకుంటే అపుడు రాజశేఖర్ ఎలాంటి సమాచారమైనా తస్కరించి ప్రవీణ్‌కు అందజేసేవాడు. టౌన్‌ప్లానింగ్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు ఫిర్యాదు రావడంతో రేణుకను తెరమీదకు తెచ్చారు. ఆమెకోసమే ఆ పని చేసినట్లు నమ్మించారు. లీకేజి కేవలం ఒక్క పరీక్షే పరిమితం కాలేదని.. విగతా ప్రశ్నాపత్రాలను వీరిద్దరూ చోరి చేసినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో ప్రధాన నిందుతుడైన ప్రవీణ్ గత ఏడాది అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో మంచి మార్కులు రావడంతో అనుమానాలు మొదలయ్యాయి. దీంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో అక్టోబర్ నుండే కమిషన్ కంప్యూటర్ వ్యవస్థను రాజశేఖర్, ప్రవీణ్‌లు తమ అధీనంలోకి తెచ్చుకున్నట్లు నిర్ధారణయ్యింది. కానీ వీరు తన స్నేహితురాలు రేణుక కోసం ఎఇ ప్రశ్నపత్రం చోరీ చేసినట్లు చెప్పారు. కార్యాలయానకి చెందిన ఓ ఉద్యోగి యూజర్ ఐడి, పాస్‌వర్డ్ తస్కరించి.. దాని ద్వారా ఫిబ్రవరిలో ప్రశ్న పత్రాలకు సంబంధించిన ఫోల్డర్‌ను నాలుగు పెన్ డ్రైవ్‌లో కాపీ చేసుకున్నట్లు రాజశేఖర్ చెప్పాడు. కానీ.. అక్టోబర్‌లోనే పేపర్‌లు తస్కరించినట్లు సిట్ దర్యాప్తులో తేలినట్టు సమాచారం.