`370` రద్దు రాజ్యాంగ విరుద్ధం : చిదంబరం

న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 ని ఏకపక్షంగా రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లోని పార్టీలను, వేర్పాటువాద పార్టీలను దేశ వ్యతిరేకులుగా చూడటం తగదని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దు ఏకపక్ష నిర్ణయమని, రాజ్యాంగ విరుద్ధమైనదని, దీనిని వెంటనే రద్దు చేయాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.
జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రజల హక్కులను పునరుద్ధరించడానికి జమ్మూలోని ప్రధాన స్రవంతి ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావడాన్ని ఆయన స్వాగతించారు. భారత ప్రజలు కూడా స్వాగతించాలని ఆయన పిలుపునిచ్చారు. జమ్మూ కశ్మీర్ ప్రజల హక్కులను పునరుద్ధరించే క్రమంలో కాంగ్రెస్ ఎప్పడూ వారికి అండగా ఉంటుందని చిదంబరం పేర్కొన్నారు.
The coming together of mainstream regional parties of J&K to fight a constitutional battle to restore the rights of the people of Jammu, Kashmir and Ladakh is a development that must be welcomed by all the people of India
— P. Chidambaram (@PChidambaram_IN) October 16, 2020