ఏలూరు జిల్లాలో వాహ‌నాన్ని ఢీకొట్టిన దురంతో రైలు..

ఏలూరు (CLiC2NEWS): జిల్లాలోని భీమ‌డోలు వ‌ద్ద ఓ వాహ‌నాన్ని రైలు ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో వాహ‌నం తుక్కుతుక్కయింది. రైలు ఇంజ‌ను ముందుభాగం దెబ్బ‌తిన‌డంతో రైలు 6 గంట‌ల‌కు పైగా నిలిచిపోయింది. హైద‌రాబాద్ నుండి విశాఖ‌ప‌ట్నం వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ భీమ‌డోలు జంక్ష‌న్ వ‌ద్ద బొలెరో వాహ‌నాన్ని ఢీకొట్టింది. ఈ వాహ‌నంతో కొంత‌మంది వ్య‌క్తులు రైల్వే గేటును ఢీకొట్టి ట్రాక్‌పైకి వ‌చ్చారు. రైలు స‌మీపించ‌డంతో వాహ‌నాన్ని అక్క‌డే వ‌దిలేసి పారిపోయారు. రైలు వాహనాన్ని ఢీకొన‌డంతో రైలు ఇంజ‌ను ముందు భాగం దెబ్బ‌తినడంతో మ‌రో ఇంజిన్‌ను అమ‌ర్చారు. అయితే వాహ‌నంలో వ‌చ్చింది ఎవ‌రు.. గేటును ఎందుకు ఢీకొట్టారు.. అని పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

Leave A Reply

Your email address will not be published.