గంటకు 160 కి.మీ వేగం.. భోపాల్-ఢిల్లీ మధ్య వందే భారత్ రైలు

ఢిల్లీ (CLiC2NEWS): దేశంలో 11వ వందే భారత్ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్-ఢిల్లీ మధ్య రాకపోకలు కొనసాగించేందుకు వందే భారత్ రైలును ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాణి కమలాపతి స్టేషన్ నుండి ప్రారంభించారు. భారతీయ రైల్వేలో గంటకు 160 కి.మీ వేగంతో నడిచే మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇది. ఇప్పటివరకు ఉన్న వందే భారత్ ఎక్స్ప్రెస్లు గంటకు 130 కి.మీ వేగంతో నడుస్తాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతోన్న భారత్కు.. వందే భారత్ రైలు నిదర్శనమన్నారు. ఇది మనదేశ నైపుణాలు, శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు